క్షణం తీరిక లేక మాట వరసకు మాటైనా పలకక
ఉండు.. వేచిఉండు అని పలుమార్లు
పలికే మాట వినలేక ఒంటరినైన వేళ
నిశ్శబ్దంగా ఉన్న నా వైపుకి అడుగు వేసిన
తను ఎంత అద్భుతంగా కనిపిస్తుంది
నాకై వచ్చి వేచి ఉన్నపుడు అపురూపమే కదా
ఆదరించమనసాయే... ప్రేమించమనసాయే
తనతో కలిసి నడక సాగించ అడుగువేసే వేళ
వచ్చినది "మృత్యువు ' చేయి వీడమని
సంజ్ఞ చేసిరి మాట్లాడని మనుషులు
వచ్చిన వారిని కాదనుట సమ్మతము కాక
చేయి అందించి వెనుతిరుగుట న్యాయం కాదని
తనతో కలిసి అనంతమైన అడుగులు వేశా..
ఇప్పుడు అందరికీ ఎంత తీరికో
సమయము పొదవి పట్టుకొని
నాకై పలు మాటలు
విదిలించారు కుప్పలు కుప్పలుగా....